Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బాలికపై ఎంఐఎం నేత అత్యాచారం!

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (14:29 IST)
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని చాదర్‌ఘాట్ కమలానగర్ ప్రాంతానికి ఓ హిందూ దళిత బాలికపై స్థానిక ఎమ్మెల్యే నేత షకీల్ కన్నేశాడు. లాక్‌డౌన్ సమయంలో ఆ యువతి ఇల్లువదిలి రోడ్డుపైకి వచ్చింది. 
 
ఇదే అదునుగా భావించిన ఎంఐఎం నేత ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి షకీల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు 
 
మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, పాతబస్తీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. షకీల్‌కు ఎంఐఎం అండగా ఉందని ఆరోపించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
 
ఇదిలావుంటే, బాధితురాలిని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా పరామర్శించారు. అయితే, ఎమ్మెల్యే బలాల బాధితురాలు ఇంటికి చేరుకున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 
 
దీనిపై బలాలా మాట్లాడుతూ, నిందితుడికి పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఫొటోలు పెట్టుకున్న వారంతా అనుచరులు కాదని అన్నారు. ప్రధాని మోడీ ఫొటోను విజయ్ మాల్యా పెట్టుకున్నారని... అంత మాత్రాన మోడీని విమర్శిస్తే ఎలాగని ప్రశ్నించారు. అయితే, స్థానికుల నిరసలు మిన్నంటడంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments