Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్ చేసి.. సెల్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితంలేని యువతిపై గ్యాంగ్ రేప్ చేస్తూ... దాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి.. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వికృత చర్య ఒకటి వెలుగులోకి

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితంలేని యువతిపై గ్యాంగ్ రేప్ చేస్తూ... దాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి.. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వికృత చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం రావుపేట గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రావుపేట గ్రామంలో మతిస్థిమితంలేని యువతిని ఆమె తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో అదేగ్రామానికి చెందిన రాజయ్య అనే 57 సంవత్సరాల వ్యక్తి, ఆయనతోపాటు 20 ఏళ్ల వయసున్న లక్ష్మణ్, రాకేష్‌లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా సెల్‌లో చిత్రీకరించి ఆ విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 31నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్‌, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో వీడియో ప్లే అయింది.
 
చివరికి వీడియో కరీంనగర్ పోలీసులకు చేరడంతో వారు కేసును సుమోటోగా తీసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు సైతం ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేని నిస్సహాయ స్థితి. తమ కుమార్తె పరిస్థితి చూసి లోలోపలే కుమిలిపోవడం తప్ప బయటకు చెప్పుకోలేని పరిస్థితి కావడంతో పోలీసులు చొరవచూపారు. ప్రస్తుతం పోలీసులు రాజయ్య, రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ కోసం గాలిస్తున్నారు. ఈ ముగ్గురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం