మెదక్ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. తాగిన మైకంలో ఓ యువకుడి మరో యువకుడు తాళి కట్టాడు. ఆ తర్వాత తాళి కట్టించుకున్న యువకుడు కాపురానికి వెళ్లాడు. దీంతో ఆ గ్రామస్థులంతా ఒక్కసారి షాక్‌కు గురయ్యారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 యేళ్ళ యువకుడికి మెదక్ జిల్లా చిలప్‌చేడ్ మండలం చుండూరుకు చెందిన 22 యేళ్ల ఆటో డ్రైవర్‌తో ఓ కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఈ నెల ఒకటో తేదీన తాగిన మైకంలో చండూరు యువకుడితో జోగిపేట యువకుడు తాళి కట్టించుకున్నాడు. అక్కడి వరకు అంతా బాగానేవుంది. అస్సలు కథ అక్కడ నుంచే మొదలైంది.
తాను కాపురానికి వచ్చానంటూ తాళి కట్టించుకున్న యువకుడు దానిని కట్టిన యువకుడి ఇంటికి కావడంతో అంతా ఒక్కసారి షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వచ్చిన యువకుడిని తాళి కట్టిన యువకుడి తల్లిదండ్రులు మందలించి పంపేశారు. దీంతో అతడు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీన్ ఠాణాకు మారింది.
గ్రామపెద్దలు, ఇద్దరు యువకులు కుటుంబ సభ్యులను పిలిచి పోలీసులు పంచాయితీ పెట్టారు. అయితే, లక్ష రూపాయలు ఇస్తే కేసు వాపసు తీసుకుంటానని తాళి కట్టించుకున్న యువకుడు మొండిపట్టుపట్టాడు. చివరకి అతడిని ఎలాగోలా ఒప్పించి రూ.10 వేలు ఇచ్చేందుకు సమ్మతించారు. దీంతో కేసు వాపసు తీసుకోవడంతో అంతరా ఊపిరి పీల్చుకున్నారు.