Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస నేతను నిలబెట్టి కాల్చి చంపిన మావోయిస్టులు...

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇటీవలికాలంలో మావో కార్యక్రమాలు జోరందుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో గ్రేహౌండ్స్ దళాలు కూంబింబ్ ఆపరేషన్లు నిర్వహించాయి. అదేసమయంలో పోలీసులు జరిపిన ఈ తనిఖీల్లో మావో ప్రముఖ నేతలు తప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ కూడా మావో ప్రభావిత జిల్లాల్లో మకాం వేశారు. 
 
ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలోని ములుగు జిల్లా, వెంకటాపురం మండలం అలుబాక సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానిక తెరాస నేత భీమేశ్వరరావును దారుణంగా కాల్చి చంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భీమేశ్వరరావు ఇంట్లోకి జొరబడిన ఆరుగురు మావోయిస్టులు, ఆయనను తొలుత బయటకు లాక్కొచ్చారు.
 
ఆపై అదే ప్రాంతంలో కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెళ్లిపోయే వేళ, మావోలు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు పరిధిలో మావోల ఏరివేత దిశగా కూంబింగ్‌ను పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు మావోలు ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments