మణికొండలో గోతిలో పడి చనిపోయిన వ్యక్తి గుర్తింపు...

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:36 IST)
హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి రెండు గంటల పాటు కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమలో మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంత‌లో ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. 
 
ఆ వ్యక్తిని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అతని పేరు గోపిశెట్టి ర‌జ‌నీకాంత్ (42)గా పోలీసులు గుర్తించారు. అత‌డి ఇల్లు ఘ‌ట‌నాస్థ‌లికి 50 మీట‌ర్ల దూరంలోనే ఉంది. అత‌డు షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నాడు.
 
శనివారం రాత్రి 9 గంట‌ల‌కు ఇంటిని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి నీటిలో ఉన్న డ్రైనేజీ గుంత‌ను చూసుకోకుండా అడుగు వేయడంతో అందులో ప‌డ్డాడు. అత‌డి కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు 15 గంట‌లుగా గాలిస్తున్నాయి. 
 
ప్ర‌స్తుతం నాలాలు క‌లిసే ప్రాంతంలో ర‌జనీకాంత్ కోసం ఓ బృందం గాలిస్తోంది. అలాగే, చెరువు వ‌ద్ద కూడా మ‌రో బృందం గాలిస్తోంది. కాగా శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో హైద‌రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట‌ మునిగిన విష‌యం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments