Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను ట్రాప్ చేసి కల్లు తాగించేవాడు.. స్కూటీ మీద ఎక్కించుకుని..?

Webdunia
గురువారం, 13 మే 2021 (22:05 IST)
మహిళలను ట్రాప్ చేసే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి నారపల్లికి చెందిన హుస్సేన్ ఖాన్ 2008 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. 
 
ఇతడు ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని నేరాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. తొలుత యువతులను మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. అలా తన బుట్టలో పడిన యువతులను కల్లు కంపౌండ్ వదద్దకు తీసుకెళ్లి కల్లు తాగించేవాడు.
 
అనంతరం యువతులను స్కూటీ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. అక్కడ వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం వారి దగ్గర ఉన్న బంగారం దోచుకుని వెళ్లేవాడు. మొత్తం హుస్సేన్‌పై 17 కేసులు నమోదయ్యాయి. దరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. హుస్సేన్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
 
అలాగే హుస్సేన్‌కు న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేలా చూస్తామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఇక, అరెస్ట్ అయిన హుస్సేన్ ఖాన్ వద్ద నుంచి 90 గ్రాముల బంగారం, 45వేల నగదు, మొబైల్ ఫోన్, హోండా యాక్టీవ్ బైక్ సీజ్ చేశామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments