ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో..?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (20:15 IST)
ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో ఓ ప్రియుడు త‌న ప్రియురాలిని క‌త్తితో గొంతు కోసి హ‌త్య చేసిన ఘటన రామ‌గిరి మండల ప‌రిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేకే న‌గ‌ర్‌కు చెందిన గొడుగు అంజ‌లి(18), రాజు(22) అనే యువ‌కుడు గ‌త మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. 
 
అయితే అంజ‌లి డిగ్రీ చ‌దువుతుండ‌గా, రాజు 8-ఇంక్లైన్ కాల‌నీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని రాజు.. అంజ‌లిపై గ‌త కొద్ది రోజుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చాడు. డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుందామ‌ని అంజ‌లి రాజుకు స‌ర్దిచెప్పింది.
 
ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని రాజు ఒత్తిడి తేవ‌డంతో.. ఇటీవ‌ల వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ కూడా చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సాయంత్రం అంజ‌లి ఇంటికి చేరుకున్న రాజు.. ఆమె గొంతును క‌త్తితో కోసి హ‌త్య చేసి పారిపోయాడు. ఈ హ‌త్య ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments