Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు ప్రేమించి ఇప్పుడు కాదంటావా? ఓయూ వెనకాల బ్లేడుతో గొంతు కోశాడు...

హైదరాబాద్‌లో జరిగిన ప్రేమోన్మాదం మరో అమ్మాయిని బలితీసుకుంది. అంబర్‌నగర్‌లో నివాసముంటున్న హరిప్రసాద్, రేవతి దంపతులకు అనూష, గ్రీష్మ ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు అనూష నారాయణగూడలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతుండగా, ఇదే కాలనీలో ఉండే ఆరెపల్లి

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (12:50 IST)
హైదరాబాద్‌లో జరిగిన ప్రేమోన్మాదం మరో అమ్మాయిని బలితీసుకుంది. అంబర్‌నగర్‌లో నివాసముంటున్న హరిప్రసాద్, రేవతి దంపతులకు అనూష, గ్రీష్మ ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు అనూష నారాయణగూడలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతుండగా, ఇదే కాలనీలో ఉండే ఆరెపల్లి  వెంకటేశ్‌ హిమాయత్‌నగర్‌లోని న్యూచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. పక్కపక్క వీధుల్లో నివాసముండే వెంకటేష్, అనూషలు 10వ తరగతి వరకూ ఒకే ట్యూషన్లో కలిసి చదువుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
 
అయితే ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో అనూష గత ఆర్నెళ్లుగా అతనికి  దూరంగా ఉంటోంది. దీంతో వెంకటేశ్‌ అనూషపై కోపం పెంచుకున్నాడు. అయినా వెంకటేష్ గత నెలరోజులుగా ఆమెను ఫాలో అవుతూ కళాశాలకు వెళుతున్నాడు. మంగళవారం ఉదయం వెంకట్‌ ఆమెకు ఫోన్‌ చేసి ఓయూ వెనకాల ఉన్న పాడుబడ్డ క్వార్టర్లో  కలిశాడు. వెంకట్‌ తన ప్రేమ గురించి చెప్పడంతో అనూష నిరాకరించింది. కోపోద్రిక్తుడైన వెంకట్‌ బ్లేడుతో మూడుసార్లు గొంతు కోశాడు. 
 
తీవ్ర రక్తస్రావంతో అనూష పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది. అనూష అరుపులు విన్న ఇమ్రాన్, ఇజాజ్‌ అనే ఇద్దరు యువకులు వెళ్లి చూడగా అప్పటికే అనూష రక్తం మడుగులో పడి ఉంది. వీరిని చూసి పారిపోవడానికి యత్నించిన వెంకటేశ్‌ను పట్టుకున్నారు. స్థానికులు చితకబాది వెంకటేష్‌ను పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే అనూష మృతి చెందింది. అనూష తండ్రి హరిప్రసాద్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. ఇటీవలే విజయవాడకు బదిలీ కావడంతో, పిల్లల చదువుల నిమిత్తం  కుటుంబాన్ని ఇక్కడే ఉంచి తను మాత్రం విజయవాడ వెళ్లివస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments