Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తితో వ్యక్తి హల్ చల్.. వృద్ధురాలితో పాటు మనవడిపై దాడి

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (10:36 IST)
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. బండ్లగూడ మల్లికార్జుననగర్‌లో అర్థరాత్రి వినోద్ అనే వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. ఓ ఇంటిపై దాడి చేసిన వినోద్.. వృద్ధురాలితో పాటు మనుమడు జాన్ మెడిపై కత్తితో దాడి చేశాడు. 
 
ఇద్దరూ పెద్దగా కేకలు వేయడంతో ఆ ఇంటికి స్థానికులు చేరుకున్నారు.. దీంతో.. దాడి చేసిన వినోద్ పారిపోయే ప్రయత్నం చేయగా. అతడిని వెంటాడి పట్టుకున్నారు కాలనీ వాసులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
మరోవైపు.. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలి, ఆమె మనవడిని ఆసుపత్రికి తరలించారు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కత్తితో దాడి చేసిన వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.. కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
 
అయితే, దుబాయ్‌లో ఉంటున్న వృద్ధురాలి కూతురు డబ్బులు అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించకపోవడమే దాడికి కారణంగా తెలుస్తోంది. డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతోనే వారిపై దాడి చేసినట్టు నిందితుడు.. పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments