Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ టీడీపీకి మరో షాక్.. పాలమూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా

తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మహబూబ్ నగర్ టీడీపీ అధ్యక్షుడు ఉదయ్ చందర్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (10:46 IST)
తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మహబూబ్ నగర్ టీడీపీ అధ్యక్షుడు ఉదయ్ చందర్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది.
 
టీ టీడీపీ ఫైర్‌‍బ్రాండ్ ఏ. రేవంత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెల్సిందే. దీంతో ఆయన వెంట అనేక మంది సీనియర్ నేతలు నడిచారు. ఈ కోవలో ఉదయ్ చందర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్‌ద్వారా పంపించారు. 
 
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ ప్రజాసమస్యలపై పోరాడానని లేఖలో పేర్కొన్నారు. తొర్రూరు, పెద్ద వంగర, డోర్నకల్‌ మండలాలకు చెందిన తెదేపా ముఖ్య నాయకులు, వివిధ గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు నరేందర్‌రెడ్డి వెంట నడవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
 
ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల వల్ల స్థానికంగా పార్టీని నిలబెట్టుకుని ప్రజాప్రతినిధులను గెలుపించుకోలేని పరిస్థితులు ఉన్నాయని స్పష్టంచేశారు. అందుకే పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments