గంగ చనిపోయింది.. కానీ ఐదుగురిని ప్రాణమిచ్చింది.. ఎలాగంటే..?

నవమాసాలు మోసి ఇద్దరికి శిశువులకు జన్మనిచ్చింది. ఆపై అవయవదానంతో ముగ్గురికి ఆ మహిళ ఊపిరిపోసింది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్‌ జిల్లా మనిగిళ్ల గ్రామానికి చెందిన ఎన్‌.గంగ(22), భర్త వేణగోపాల్‌రెడ్డి వ్య

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (09:17 IST)
నవమాసాలు మోసి ఇద్దరికి శిశువులకు జన్మనిచ్చింది. ఆపై అవయవదానంతో ముగ్గురికి ఆ మహిళ ఊపిరిపోసింది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్‌ జిల్లా మనిగిళ్ల గ్రామానికి చెందిన ఎన్‌.గంగ(22), భర్త వేణగోపాల్‌రెడ్డి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. గంగకు పురిటి నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 14న గంగ కవలలకు జన్మనిచ్చింది. మగ, ఆడ శిశువులు జన్మించారు. 
 
మొదటికాన్పులోనే ఇద్దరు పుట్టడంతో దంపతులు ఎంతో సంతోషం పడ్డారు. కానీ వారి సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. ప్రసవించిన రెండు రోజులకే గంగ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. 16న గంగ ఆకస్మాత్తుగా కోమాలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 18న నిమ్స్‌కు తరలించారు. 
 
అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో బ్రెయిన్‌డెత్‌గా వైద్యులు నిర్ధారించారు. నిమ్స్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కో-ఆర్డినేటర్స్‌ ప్రదీప్‌, శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో  గంగ అవయవదానానికి ఆమె భర్త అంగీకరించారు. ఫలితంగా గంగ మూత్రపిండాలు, కాలేయం ముగ్గురిని బతికించాయి. దీంతో గంగ చనిపోయినా ఆమె ఐదుగురికి ప్రాణమిచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments