తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం లాక్డౌన్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే జంట రెండు నగరాల్లోని వైన్ షాపుల ముందు భారీ క్యూలు కనబడ్డాయి. చాలా షాపులలో మందుబాబులు క్యూలలో నిలబడి కోవిడ్ భద్రతా ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కేశారు.
కౌంటర్ల ముందు క్యూలలో తోసుకుంటూ కనిపించారు. భౌతిక దూరం పాటించాలని దుకాణదారులు కోరినప్పటికీ, మందుబాబులు మాత్రం మద్యం కొనడానికి ఒకరితో ఒకరు పోటీపడి నెట్టుకుంటూ కనబడ్డారు. కొంతమంది కస్టమర్లు ఫేస్ మాస్క్‌లను సైతం సరిగా ధరించలేదు.
వైన్ షాపుల యజమానులు రాత్రి వరకు విక్రయించడానికి తగినంత స్టాక్ ఉందని వినియోగదారులకు తెలియజేసినప్పటికీ, వినియోగదారులు కోవిడ్ భద్రతా నిబంధనలను విస్మరించారు. పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను కొనుగోలు చేసేందుకు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు.