హైదరాబాద్ షేక్‌పేట్‌లో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న శిరీష ఆత్మహత్యలో కొత్తకోణాలు వెలికివస్తున్నాయి. కుకునూరుపల్లి ఎస్సై మధ్యాహ్నం ఒంటిగంటకు ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యకు లింకున్నట్లు వార్తలు
హైదరాబాద్ షేక్‌పేట్‌లో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న శిరీష ఆత్మహత్యలో కొత్తకోణాలు వెలికివస్తున్నాయి. కుకునూరుపల్లి ఎస్సై మధ్యాహ్నం ఒంటిగంటకు ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యకు లింకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వివాదంపై శిరీష టీమ్ కుకునూరుపల్లి ఎస్సై వద్దకు వెళ్లారు. ఆ క్రమంలో వారు అక్కడ మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులో గొడవలు జరిగినట్లు సమాచారం.
ఆ పంచాయతీ తెల్లవారు జాము 3 గంటల వరకూ జరిగినట్లు తెలుస్తోంది. అదలా సాగుతుండగానే ఎస్సై మద్యం మత్తులో శిరీషపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేని శిరీష తిరుగు ప్రయాణంలో కారులో నుంచి దూకేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఐతే చివరికి ఆమె తన కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఐతే తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని శిరీష తన స్నేహితురాలితో పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీషతో పాటుగా కుకునూరుపల్లి వెళ్లిన రాజీవ్, శ్రావణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి కీలక సమాచారం రావడంతో, ఇందులో ఎస్సై దోషిగా నిలబడక తప్పదని తేలడంతో ప్రభాకర్ రెడ్డి భయంతో తన సర్వీస్ రివాల్వరుతో సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.
మరోవైపు శిరీష మృతదేహాన్ని పరిశీలించినప్పుడు ఆమె పెదవులపై, మెడపై పంటిగాట్లు వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పడం చూస్తుంటే అది హత్యేనేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రావణ్ పాత్ర ఏమిటన్నది తేలాల్సి వుంది.