Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో(L&T)తో పెట్టుకున్న కేసీఆర్... కేంద్రం వార్నింగ్ ఇచ్చిందా...?

Webdunia
శుక్రవారం, 11 జులై 2014 (17:40 IST)
కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ... షాక్ మీద షాక్ తగులుతోందా...? అంటే అవుననే అంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత తెలంగాణ భూములను వెనక్కి లాక్కునే పనిలో మంచి హుషారుగా ఉన్న కేసీఆర్... అదే ఊపుతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టికి కూడా ఓ సూచనను చేశారు. 
 
తెలంగాణ అసెంబ్లీ నుంచి బేగంబజారు వరకూ చారిత్రక కట్టడాలున్నాయి కనుక వాటికి ఎలాంటి నష్టం కలుగకుండా రైలు మార్గాన్ని భూగర్భంలో వేయాలని సూచించారు. దీనిపై ఆయన ఒక్క మెట్టు కూడా కిందికి దిగలేదు. ఇదిలావుండగానే ఎల్ అండ్ టి వారు నేరుగా సమస్యను కేంద్రం వద్ద పెట్టి తమకు ముందుగా ఇచ్చిన ప్రకారం అనుకున్నది అనుకున్నట్లు చేయాలంటే, ఇచ్చిన సమయంలో పూర్తి చేయాలంటే పాత ప్రణాళిక ప్రకారం చేయగలమని తేల్చి చెప్పినట్లు సమాచారం. 
 
దీంతో కేంద్రంలో ఓ కీలక మంత్రి కేసీఆర్‌తో ఈ విషయంపై ఓ సందేశాన్ని పంపారనీ, మెట్రో రైలు ప్రాజెక్టును అనుకున్న సమయంలో తాము పూర్తి చేయదలచామని అడ్డుంకులు కలుగకుండా చూసుకోవాల్సిందిగా సుతిమెత్తగానే సూచించినట్లు సమాచారం. మరి కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో మెట్టు దిగుతారో లేదో చూడాల్సిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments