నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - దావోస్‌లో మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (10:58 IST)
స్విట్జర్లాండ్‌లో జరుగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్ చేసుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తాను దావోస్ వచ్చిన ప్రతిసారీ ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా సోమవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభమవుతుంది. విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగుతుంది. ఇందులో 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు హాజరువుతారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ, ఆశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరువుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments