Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపిన మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (17:51 IST)
తనపై అసత్య ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం పరువు నష్టం దావాకు సంబంధించి లీగల్ నోటీసులు పంపించారు. 
 
మంత్రి కేటీఆర్ నిర్వాహకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఇటీవల బండి సంజయ్ ఆరోపించారు. ఈ మరణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని లేదా వెనక్కి తీసుకోవాలని లేదా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 
 
అయితే, బండి సంజయ్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని లేనిపషంలో పరువు నష్టం దావా వేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసులపై బండి సంజయ్ స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments