Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేక్‌పేట్ ఫ్లైఓవర్‌‌ను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (14:21 IST)
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ కొత్త ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఆరు లేన్లుగా నిర్మించిన షేక్‌పేట్ ఫ్లైఓవర్‌‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. మొట్టమొదటి ఆరు లేన్ల ఫ్లైఓవర్ ఇది. 
 
ఈ షేక్‌పేట్ ఫ్లైఓవర్ నాలుగు జంక్షన్ల మీదుగా సాగుతుంది. షేక్‌పేట్, ఫిల్మ్‌నగర్, ఉస్మానియా యూనివర్శిటీ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లను మీదుగా ప్రయాణం సాగించడానికి వీలుగా ఫ్లైఓవర్ నిర్మించారు.  ఈ ఫ్లై ఓవర్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
దాదాపు 333.55 కోట్ల రూపాయలతో వ్యయంతో దీన్ని నిర్మించింది కేసీఆర్ సర్కార్. దీని పొడవు 2.71 కిలోమీటర్లు. వెడల్పు సుమారు 24 మీటర్లు. ఆరు లేన్లుగా..రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీన్ని డిజైన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments