కిసాన్‌ నమ్మాన్‌ నిధికి రైతుబంధు పథకమే స్ఫూర్తి.. కేటీఆర్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (15:26 IST)
కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న కిసాన్‌ నమ్మాన్‌ నిధి పథకానికి మన రైతుబంధు పథకమే స్ఫూర్తి అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాత జీవతాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందన్నారు. 
 
తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం బోరుబావులపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉండేది. అర్ధరాత్రులు విద్యుత్‌ కోసం పొలాల వద్ద పడిగాపులు గాయాల్సిన వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చిందని గుర్తుచేశారు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తన తాతయ్య-నానమ్మ పేరిట సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికల్లో అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments