Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉమ్మడి'గానే బాగున్నది.. తెలంగాణ కోసం కొట్లాడి బాధపడుతున్నా...

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (12:47 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన రాజకీయ నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన ఎంపీగా ఉన్నారు. ఇపుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని బాగుండేవన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినందుకు ఇపుడు బాధపడుతున్నట్టు తెలిపారు.
 
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాటలు విన్న తర్వాత రాష్ట్రం ఉమ్మడిగానే ఉంటే బాగుండేదని తనకు అనిపిస్తోందన్నారు. గతంలో ఎంపీగా పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
 
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే పార్టీని కరోనా వైర్‌సతో పోల్చడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను గౌరవించాలన్న ఇంగితజ్ఞానం సీఎంకు లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్టానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. పార్టీ సరైన నిర్ణయం తీసుకోకుంటే తమదారి తాము చూసుకుంటామన్నారు. 
 
తమ పార్టీ ఎంపీ ఏ.రేవంత్‌ రెడ్డి విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా కొందరు నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం సరికాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments