Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కిషన్ రెడ్డి పార్టీ మార‌డు... చెప్పింది కూడా కిషన్ రెడ్డే...

బీజెపి నాయ‌కుడు కిష‌న్ రెడ్డి పార్టీ మార‌నున్నాడు అంటూ వస్తోన్న వార్త‌లపై కిష‌న్ రెడ్డి స్పందిస్తూ... ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. వేయి తెరాసలు వచ్చినా లక్షమంది కెసిఆర్‌లు పుట్టినా కిషన్ రెడ్డి పార్టీ మారడ‌న్నారు. మజ్లిస్‌తో కలిసి తెరాస మోడీకి వ

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (22:13 IST)
బీజెపి నాయ‌కుడు కిష‌న్ రెడ్డి పార్టీ మార‌నున్నాడు అంటూ వస్తోన్న వార్త‌లపై కిష‌న్ రెడ్డి స్పందిస్తూ... ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. వేయి తెరాసలు వచ్చినా లక్షమంది కెసిఆర్‌లు పుట్టినా కిషన్ రెడ్డి పార్టీ మారడ‌న్నారు. మజ్లిస్‌తో కలిసి తెరాస మోడీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందన్నారు. పెత్తందారి పార్టీ తెరాస, పెత్తందారి నాయకుడు కెసిఆర్. బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాడట. ఎవరికన్నా గుణపాఠం చెప్పాలంటే అది తెరాసకె, కెసిఆర్‌కు చెప్పాలి. కనీసం తన సొంత నియోజకవర్గం గజ్వెల్‌లో రైతుల ఆత్మహత్యలు ఆపలేనటువంటి కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాలి. 
 
ఫీ రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడుస్తూ స్కాలర్షిప్ సకాలంలో ఇవ్వనందుకు పంటల బీమా పథకం అమలు చేయనందుకు ఉద్యోగాల భర్తీ చేస్తానని చెప్పి చేయనందుకు, రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పి ఇంకా సమస్య కొలిక్కి రానందుకు కెసిఆర్‌కి గుణపాఠం చెప్పాలి అన్నారు. ఇస్లాం దేశాల్లో కూడా మహిళలు మంత్రులుగా ఉన్నారు. రేషన్ కార్డ్స్ రద్దు చేసి.... కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా పేదల జీవితాలతో అడుకుంటున్నందుకు గుణపాఠం చెప్పాలి.
 
పీఆర్సీ బకాయిలు ఇవ్వనందుకు గుణపాఠం చెప్పాలి. డబుల్ బెడ్రూం ఇస్తానని ఆశలు లేపి ఇవ్వనందుకు గుణపాఠం చెప్పాలి. డ్వాక్రా మహిళలకు ఋణాల్లో అన్యాయం చేస్తున్నందుకి గుణపాఠం చెప్పాలి. నెరేళ్ల ఇసుక మాఫియాపై చర్యలు తీసుకొమ్మన్నందుకు దళితులపై దాడులు చేస్తున్నందుకు గుణపాఠం చెప్పాలి. భూ ఆక్రమణ‌లను పెంచిపోషిస్తున్నందుకు... మీకు గుణపాఠం చెప్పాలి. ఇసుక దందాతో దండుకుంటున్నందుకు కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాలి అంటూ కెసిఆర్ పైన ఘాటుగానే విమ‌ర్శ‌లు చేసారు కిష‌న్ రెడ్డి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments