Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందే రెడీ అయిన ఖైరతాబాద్ వినాయకుడు

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:02 IST)
హైదరాబాదులోని ఖైరతాబాద్‌ గణేశుడు సిద్ధమయ్యాడు. వినాయక చవితికి ఐదు రోజుల ముందే పూర్తయిన పంచముఖ రుద్రగణపతిని చూసేందుకు భక్తులు అప్పుడే క్యూకడుతున్నారు.

గతేడాది కరోనా కారణంగా 11 అడుగుల విగ్రహానికే పరిమితమైన నిర్వాహకులు ఈసారి 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని తీర్చిదిద్దారు.
 
ఖైరతాబాద్‌లో వినాయకుడిని ఏర్పాటు చేయడం ప్రారంభించి 65 ఏళ్లు నిండిన సందర్భంగా రెండేళ్ల క్రితం 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఈ నెల 10 గణేశ్ నవరాత్రులు ప్రారంభం కానుండగా, 19న నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
 
కాగా, వినాయక చవితి నేపథ్యంలో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి నిన్న పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఇతర అధికారులు ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు.

రెండు క్రేన్లతో పాత విగ్రహాలను నిమజ్జనం చేసి చూశారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా, నిమజ్జన సమయం ఆదా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అంజనీకుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments