Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఢిల్లీ టూర్ సక్సెస్: హరీష్ రావుకు మరో కీలక శాఖ!

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (17:55 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతమైందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను కేంద్రాన్ని అడిగామని... నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. కేంద్ర సర్కారుతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటామన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అంశాల వారీగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయిస్తారని భావిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం ఖాయమని వివిధ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పిన తరుణంలో, ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన తెలంగాణ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావుకు మరో ముఖ్య శాఖ కూడా అప్పగించవచ్చని సమాచారం. ఖేడ్ ఫలితాలు రాగానే హరీశ్‌కు సమాచార, పౌర సంబంధాల శాఖను అప్పగించవచ్చని సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో విజయం తరువాత, ప్రచార సారధ్య బాధ్యతలు వహించిన కేటీఆర్ కు కీలకమైన మునిసిపల్ శాఖను అందించిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments