Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సేషన్ కోసం వార్తలు రాసే పత్రికల సంగతి చూస్తాం : కేసీఆర్

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:05 IST)
సెన్సేషనల్ కోసం వార్తలు రాసే పత్రికల సంగతి చూస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం హైటెక్స్ సిటీలో జరిగిన రెవెన్సూ సదస్సులో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను రాసేటప్పుడు జాగ్రత్త వహించాలని... సెన్సేషన్ కోసం వార్తలు రాయరాదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇష్టమొచ్చిన రీతిలో కథనాలను ప్రసారం చేస్తున్నాయని... వాటి సంగతి తర్వాత చూస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున కూడా పత్రిక స్థాపించే ఆలోచన ఉందని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా'పై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారాలన్నింటినీ తాను లాక్కున్నానని... బడ్జెట్ విషయాలను కూడా తానే నిర్ణయిస్తున్నానంటూ వార్తలు రాశారని... ఈ వివరాలను వారికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి తాను ఆ పత్రిక నుంచి వివరణను డిమాండ్ చేస్తున్నాని చెప్పారు. మీడియాకు తాను వార్నింగ్ ఇవ్వడం లేదని... ఆవేదనతో మాట్లాడుతున్నానని చెప్పారు. సంచలనాల కోసం వాస్తవాలను వక్రీకరించరాదని కోరారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments