Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరిసిల్లలో ఆ కంపెనీతో 1000 మందికి ఉద్యోగాలు: కేటీఆర్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (23:00 IST)
భారతదేశంలో రెడీమేడ్‌ వస్త్రాల తయారీలో పేరుగాంచిన గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దూర్ అపారెల్ పార్కులో నిర్మించ తలపెట్టిన అపారెల్ ఫ్యాక్టరీకి మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
 
ఈ కార్యక్రమంలో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ ఎండి సుమీర్ హిందూజా, చేనేత మరియు జౌళి శాఖ సంచాలకులు శైలజ రామయ్యర్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ మరియు ఎండి వి. నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
అపారెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుండగా, అందులో ఎక్కువ శాతం మహిళలు లబ్ధి పొందనున్నారు.
 
ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల‌లో అపారెల్ పార్కు ఉండాల‌నేది ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎప్పటి నుంచో క‌ల కంటున్నారు. 2005లో నాటి ప్రభుత్వం అపారెల్ పార్కు పెడుతామ‌ని హామీ ఇచ్చింది కానీ అమ‌లు చేయ‌లేదు. సీఎం శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ దానికి బీజం ప‌డిందని అన్నారు.

ఈ అపారెల్ పార్కులో రాబోయే రోజుల్లో 10 వేల మంది ఉపాధి పొందబోతున్నారని, అందులో 80 శాతానికి పైగా మ‌హిళ‌ల‌కే ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. బ‌తుక‌మ్మ చీర‌లు, గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ యూనిఫాం ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయన్నారు. దీంతో నేత‌న్న‌ల ఆదాయం పెరిగింది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments