Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలకు హెల్మెట్లు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎంతో పురోగతి సాధించామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. తమది దేశంలోనే ధనిక రాష్ట్రమంటూ డప్పు కొట్టుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అనేక ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకుని, అవి ఎపుడు కూలుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా స్లాబు పెచ్చులూడిపడుతుండంటతో అక్కడ పని చేసే ఉద్యోగులు తలకు హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో ఈ దృశ్యం కనిపించింది. 
 
ఈ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఇక్కడ పని చేసే ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండటంతో ఆ పెచ్చులు నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరువుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని పని చేస్తున్నారు. 
 
కాగా, గత 2016లో ఈ మండలం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే ఉంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో యేడాది నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. గత యేడాది ఎంపీడీవో మల్లారెడ్డి కూర్చొనివుండగా ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. 
 
ఈ విషయం ఉన్నాతాధికారుల దృష్టికి వెళ్ళడంతో అప్పటి అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించారు. కానీ, ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో ఎపుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతూ, ఇక్కడ పని చేసే ఉద్యోగులు ఇలా తలకు ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments