Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (05:40 IST)
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నంత పని చేశారు. పొన్నం ప్రభాకార్ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతూ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పని కేసు పెడతానని చెప్పిన ఆయన కేసు పెట్టనే పెట్టారు. పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. 
 
స్వయానా న్యాయవాదైన జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో కేసు దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.  ఈ నెల 21 నుంచి పొన్నం ప్రభాకర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగించాడని దావాలో పేర్కొన్నారు. ఈ విషయమై ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదన్నారు. 
 
పొన్నం ప్రభాకర్‌పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద చర్యలు తీసుకోవాలని ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.కిరణ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.  కేసును స్వీకరించిన న్యాయస్థానం పరిశీలన అనంతరం తగిన ఉత్తర్వులు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపినట్టు ఆయన తెలిపారు.
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments