Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషపై అత్యాచారం జరిగిందా.. రిమాండ్ రిపోర్టుతో బలపడుతున్న అనుమానం

హైదరాబాద్‌ నగరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న బ్యుటీషియన్ శిరీష కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో పాత్ర ఉన్న కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డిని కాపాడాలని నిందితులు శ్రవణ్, రాజీవ్ ఇద్దరూ ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాంకేతిక విషయాలు దానికి పూర్త

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (02:36 IST)
హైదరాబాద్‌ నగరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న బ్యుటీషియన్ శిరీష కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో పాత్ర ఉన్న కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డిని కాపాడాలని నిందితులు శ్రవణ్, రాజీవ్ ఇద్దరూ ఎంతగా ప్రయత్నించి నప్పటికీ సాంకేతిక విషయాలు దానికి పూర్తిగా భిన్నమైన కథనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. శిరీష మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలను గుర్తించినట్లు పోలీసులు గుర్తించటం సంచలనం కలిగిస్తోంది. న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయం బయటపడింది.
 
మరణించిన సమయంలో శిరీషలో దుస్తులపై మరకలు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిప్టోర్టులో పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.  అయితే దీనికి సంబంధించి ఫొరెన్సిక్ రిపో్ర్టులు ఇంకా రావాలని, ఆ తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్‌, రాజీవ్‌లు ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
 
ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్‌ క్వార్టర్‌లో చోటుచేసుకున్న విషయాలను సైతం పోలీసులు రిమాండ్‌ డైరీలో కోర్టుకు వివరించారు. శిరీష కేసులో ఏ1 శ్రవణ్‌.. గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లకముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్‌లో పంపాడని రిమాండ్‌ డైరీలో పేర్కొన్నారు. అంతకముందు జరిగిన ఫోన్‌ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో శ్రవణ్‌ మాట్లాడాడని వెల్లడైంది.
 
‘సెక్స్‌వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. రాజీవ్‌, శ్రవణ్‌లను క్వార్టర్స్‌నుంచి బయటికే పంపే ప్రయత్నం చేశాడు. అందుకు రాజీవ్‌ ఆసక్తి ప్రదర్శించాడు. దీంతో శ్రవణ్‌.. సిగరెట్‌ నెపంతో రాజీవ్‌ను బయటికి తీసుకొచ్చాడు. గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషను ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. ‘సాయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేమిట’ని నిలదీసింది. ‘నేను అలాంటిదాన్ని కాదం’టూ ఎస్సైని వెనక్కి నెట్టేసింది. అయినా సరే ప్రభాకర్‌రెడ్డి వినకుండా మళ్లీ దగ్గరకు వెళ్లడంతో శిరీష బిగ్గరగా కేకలు వేసింది’ అని రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం