Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ భూకేటాయింపుల్లో అక్రమాలు : అక్బరుద్దీన్!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (11:46 IST)
ఫిల్మ్ నగర్‌లో చేపట్టిన భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభా వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ సమావేశాల్లో ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. భూకేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సభాసంఘం సరిపోదని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 
 
భూకేటాయింపుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడ వేలు పెట్టినా వందల కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభాసంఘం ఆధ్వర్యంలో జరిగే విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదన్నారు. అందువల్ల మాజీ న్యాయమూర్తితో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
అంతేకాకుండా, జూబ్లీహిల్స్, నందగిరి సొసైటీ తదితర సంస్థలకు భూకేటాయింపుల పైన సమాచారం ఇవ్వాలన్నారు. గృహ నిర్మాణ సొసైటీలకు వక్భ్ భూములు కూడా కేటాయించారని ఆరోపించారు. 208 ఎకరాల భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రమంతటా వక్ఫ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, కొన్నిచోట్ల వక్ఫ్, కొన్నిచోట్ల ప్రభుత్వం స్థలం అంటున్నారని, సొసైటీకి సొసైటీకి భూకేటాయింపుపై ప్రభుత్వ వివరణ సరిగా లేదన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments