Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఫార్మాసిటీ : కేసీఆర్

Webdunia
గురువారం, 24 జులై 2014 (11:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడిచారు. హైదరాబాద్ శివార్లలో జాతీయ రహదారి పక్కన, రైలు మార్గం ఉన్న చోట, నీటి సౌకర్యం బాగా ఉన్న ప్రాంతంలో ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మసిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయంలో ఫార్మాకంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితి, భవిష్యత్తు, ఈ రంగంలో ఉన్న అవకాశాల మీద చర్చించారు. ఈ రంగంలో చైనా, భారతదేశాలే అభివృద్ధి చెందాయని, దేశంలో ఇప్పటికే తెలంగాణ అగ్రగామిగా ఉందని, మరింత అభివృద్ధి సాధించేందుకు తెలంగాణలోనే ఎక్కువ అవకాశాలున్నాయని వివరించారు. 
 
రైలుమార్గం, జాతీయ రహదారి, నీటివసతి అందుబాటులో ఉన్న చోట ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి తోడు నిరంతరాయంగా 500 మెగావాట్ల విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫార్మాసిటీకి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రవాణాకు అవకాశం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఏడు వేల ఎకరాల్లో ఫార్మా సిటీని నిర్మించాలంటూ సిగ్నల్ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా, కాలుష్య రహిత ఫార్మాసిటీ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. 
 
అంతేకాకుండా, ఫార్మా సిటీ కోసం 500 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన ప్రత్యేక పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల డ్రగ్స్ ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తుందని ఆయన హామీనిచ్చారు. పైగా ఫార్మాలో పనిచేసే ఉద్యోగుల కోసం 2 వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌లు నిర్మిస్తామన్నారు. ఇటు వంటి సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments