Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ-హెచ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న ఎంటెక్ విద్యార్థి

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (10:43 IST)
హైదారాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ-హెచ్‌లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని భరించలేక సోమవారం తన గదిలో ఉరేసుకుని ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. మానసిక ఒత్తిడిని భరించలేకపోతున్నానంటూ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. మృతుడిని ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. 
 
ఈ విద్యా సంస్థలలో గత నెలలో ఎంటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడటం అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిసివేస్తుంది. మృతుడిని మమైత్ నాయక్‌గా గుర్తించారు. గత నెలలో కార్తీక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఇపుడు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 
 
దీనిపై సంగారెడ్డి రూరల్ ఎస్ఐ స్పందిస్తూ, మమైత్ నాయక్ సోమవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 26వ తేదీనే ఎంటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఆ రోజు సాయంత్రం ఇతర విద్యార్థులు జిరగిన దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడికి గరువుతున్నా అని రాసిన సూసైడ్ లేఖను మమైత్ గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments