Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసం లేకుంటే ముద్ద దిగదు.. నాన్ వెజ్ ప్రియుల్లో హైదరాబాదీలే ఫస్ట్..!

Webdunia
శనివారం, 28 మే 2016 (16:00 IST)
దేశంలో అత్య‌ధికంగా మాంసాహారం భుజించే వారి సంఖ్య హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా ఉన్నారంటే నమ్ముతారా...? నిజంగా అన్ని దేశాలతో ఢిల్లీ ముందుంది. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో ఢిల్లీ కంటే నాన్‌వెజ్ లాగించ‌డంలో హైద‌రాబాదీ వాసులే ముందున్న‌ట్లు తేలింది. దాదాపు 30 శాతం హైద‌రాబాద్ వాసులు మ‌ట‌న్‌ని తినడానికి ఇష్టపడితే, ఢిల్లీ వాసుల్లో 7.3 శాతం మంది మ‌ట‌న్ తినేందుకు ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.
 
ఇక చికెన్ విష‌యానికొస్తే.. 55.85 శాతం మంది హైద‌రాబాద్ వాసులు ఎక్కువ‌గా కోడిమాంసంను ఇష్ట‌ప‌డుతుండ‌గా, ఢిల్లీ వాసుల్లో 6.6 శాతం మంది చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదేమైనా మాంసాహారంతో తెలంగాణ వాసులకి ఎప్ప‌టినుంచో విడదీయరాని అనుబంధం ఉంది. మాంసం లేకుంటే ఒక ముద్ద కూడా మింగుడు పడదు. 
 
హైద‌రాబాద్‌ వాసులు మొదట హోటల్‌కి వెళ్తే ఏం ఆర్డర్ ఇస్తారో తెలుసా...? మ‌ట‌న్ బిర్యానీ, చికెన్ బిర్యానీలే కామ‌న్‌గా ఆర్డ‌ర్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని స‌ర్వేలో తేలింది. ఇందులో మ‌ట‌న్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఉందట. విప‌రీత‌మైన నాన్‌వెజ్‌తో తిన‌డంతో ప‌లు ఆరోగ్య‌స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. కాని హైద‌రాబాద్లో హలీం చాలా ఫేమస్. 
 
రంజాన్ పండుగల్లో మాత్రం హ‌లీమ్‌ను విక్ర‌యించేవారు. కానీ ఇప్పుడు సంవ‌త్స‌రం మొత్తం హ‌లీమ్ దొరుకుతుంద‌ని స‌ర్వే వివ‌రించింది. దీంతో న‌గ‌రంలో మీట్ క‌న్‌సంప్ష‌న్ తారాస్థాయికి చేరుకునే అవ‌కాశం ఉందని స‌ర్వే వెల్ల‌డించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments