Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు వద్దన్నా.. ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకుంది.. కానీ పెళ్లి రోజే ఉరేసుకుంది..

ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం ప్రస్తుతం యువత ఫ్యాషనైపోయింది. అలా పెద్దలు ముందుగా వద్దన్నా.. ఎలాగో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన ఆరు నెలలకే అత్తింటిగారి అసలు స్వరూపం బయటపడింది. దీంతో వేధి

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:04 IST)
ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం ప్రస్తుతం యువత ఫ్యాషనైపోయింది. అలా పెద్దలు ముందుగా వద్దన్నా.. ఎలాగో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన ఆరు నెలలకే అత్తింటిగారి అసలు స్వరూపం బయటపడింది. దీంతో వేధింపులు తాళలేక పెళ్లి రోజే ఉరేసుకుని ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బేగంపేటకు చెందిన 29 ఏళ్ల భాగ్యలక్ష్మీ ఓ కంపెనీలో పనిచేస్తోంది. ఈమె కర్మన్ ఘాట్‌కు చెందిన శశిని ప్రేమించి మార్చి 25వ తేదీన గత ఏడాది వివాహం చేసుకుంది. గూగుల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులు బేగంపేటలోని ఏఎండీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. కానీ పెళ్లైన ఆరునెలలకు తర్వాత.. భాగ్యలక్ష్మిని అత్తింటివారు వేధించడం మొదలెట్టారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
ఆ తర్వాత ఈ దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కానీ వేధింపులు ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వివాహ జీవితం వద్దనుకున్న భాగ్యలక్ష్మి.. చివరకు శనివారం (మార్చి 25)న పెళ్లి రోజునాడే.. రాత్రి చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
భాగ్యలక్ష్మీ గది గోడలపై సూసైడ్ నోట్ రాసింది. తన చావుకు భర్త శశి, అత్తింటి కుటుంబసభ్యులు మంజుల, భాస్కర్, రమణిలు మానసికంగా వేధించారని, చనిపోయాక శవాన్నీ, తనకు సంబంధించిన వస్తువులను ఎవరు ముట్టుకోవద్దని గోడపై రాసింది. దీని ఆధారంగా శశి ఫ్యామిలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments