Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాడి వలలో హైదరాబాద్ లేడీ ... రూ.12.45 లక్షలు కొట్టేశాడు

Webdunia
గురువారం, 14 మే 2020 (20:05 IST)
నైజీరియాకు చెందిన ఓ సైబర్ నేరగాడివలలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పడింది. తాను లండన్‌లో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నానని, నిన్ను పెళ్ళి చేసుకుని హైదరాబాద్‌లో సెటిలైపోతానని నమ్మించాడు. పైగా, పెళ్లికి కావాల్సిన బంగారు, వజ్రాలు తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. అతని మాటలను పూర్తిగా విశ్వసించిన ఆ యువతి ఏకంగా 12.45 లక్షల రూపాయలను సమర్పించుకుంది. చివరకు తాను మోసపోయానని తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బోరబండలో నివాసముంటున్న ఓ యువతి కొద్దినెలల కిందట భారత్‌ మ్యాట్రిమొనీలో తన వివరాలను నమోదు చేసుకుంది. గత నెల 2న ఆమె వ్యక్తిగత వివరాలు పరిశీలించిన ఓ వ్యక్తి తాను లండన్‌లో స్థిరపడిన ఇంజినీరునని పరిచయం చేసుకున్నాడు. 
 
తన పేరు కెల్లీహేరీ అని.. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని, పెళ్లయ్యాక హైదరాబాద్‌లో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేద్దామని వివరించాడు. అప్పటి నుంచి ఇద్దరూ వాట్సాప్‌ ద్వారా మాట్లాడుకుంటున్నారు. గత నెల 12న బాధితురాలికి ఫోన్‌చేసి, పెళ్లి ఖర్చుల నిమిత్తం 85 వేల పౌండ్లు(భారత కరెన్సీలో రూ.61 లక్షలు), వజ్రాలు, బంగారు బిస్కెట్లు పంపుతున్నానంటూ నమ్మించాడు. 
 
ఆ తర్వాత కొద్దిగంటలకే ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులమంటూ ఆ యువతికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, మీ కానుకలు వచ్చాయని, ముందుగా రూ.28 వేలు చెల్లించాలని చెప్పగా.. ఆమె అలాగే చేసింది. అలా వివిధ రుసుముల పేరుతో 10 రోజుల వ్యవధిలో రూ.12.45 లక్షల నగదు బదిలీ చేయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఇంటికి బహుమతులు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments