నేడు మాదాపూర్ టెక్ మహీంద్రా వేదికగా ఈసీ సమావేశం.. ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (08:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత ఎన్నికల సంఘం అధికారులు గురువారం హైదరాబాద్ నగరంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లో ఉన్న టెక్ మహీంద్రాలో ఈ సమావేశం జరుగనుంది. ఈ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ మార్పులు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు హాజరుకానున్నారు. దీంతో టెక్ మహీంద్రా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీసులు వెల్లడించారు. 
 
ముఖ్యంగా లెమన్ ట్రీ హోటల్ నుంచి సీఐఐ వరకు, కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోటరీ వరకూ, రోటరీ - సైబర్ టవర్స్ మధ్య, కొత్తగూడ నుంచి హైటెక్స్ వరకూ ఉన్న ప్రైవేట్ సంస్థలు ఇందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. 
 
లెమన్ ట్రీ జంక్షన్, పీనిక్స్ ఎరీనా రోడ్డు, టెక్ మహీంద్రా రోడ్, సీఐఐ కూడలిలో భారీ ట్రాఫిక్‌కు ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు అలెర్ట్ చేశారు. దీంతో పాటు ఐకియా రోటరీ - లెమన్ ట్రీ జంక్షన్, సైబర్ టవర్ కూడలి, కేబుల్ బ్రిడ్జి జంక్షన్, సీగేట్ జంక్షన్, ఐకియా రోటరీ, కొత్తగూడ జంక్షన్ నుంచి సైబర్ టవర్ జంక్షన్ వరకూ భారీ ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments