Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి రద్దీ - హైదరాబాద్ - కటక్ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు

Webdunia
మంగళవారం, 30 మే 2023 (10:30 IST)
వేసవి కాలంలో ఏర్పడే ప్రయాణికుల రద్దీని నివారించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా, హైదరాబాద్ - కటక్ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య ఈ రైళ్లను నడిపేలా చర్యలు చేపట్టింది. 
 
జూన్ 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడకు చేరుకుంది. అక్కడన ుంచి 9.07 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు కటక్‌కు చేరుతుంది. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో కటక్ నుంచి జూన్ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 10.30 గంట బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.35 గంటలకు దువ్వాడ చేరుతుంది. రెండు నిమిషాల్లో మళ్లీ బయలుదేరి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఇది నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, బరంపురం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్లలో ఆగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం