Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించిన వంతెనకు ముప్పు?

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (11:47 IST)
హైదరాబాద్ సంస్థానంలో నిర్మించిన వంతెనల్లో మొదటిది పురానాపూల్ బ్రిడ్జి. దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్‌షా 1578లో నిర్మించారు. ఈ వంతెన నిర్మించి సుమారు 400 సంవత్సరాలు అయివుంటుంది. అలాంటి వంతెన ఇపుడు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ముఖ్యంగా, ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుని పోయిన విషయం తెల్సిందే. ఈ వర్షం, ఈ కారణంగా వచ్చిన వరద ప్రభావం ఈ వంతెనపై కూడా పడింది. గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు వరద ఉద్ధృతి పెరగడంతో బ్రిడ్జి ఒత్తిడికి గురైంది. 
 
ఫలితంగా గత రాత్రి ఓ పిల్లర్ కుంగిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వైపుల నుంచి ట్రాఫిక్ నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
 
4 శతాబ్దాల కాలంలో పురానాపూల్ బ్రిడ్జి దెబ్బతినడం ఇది రెండోసారి మాత్రమే. హైదరాబాద్‌లో నిర్మించిన తొలి వంతెనగా రికార్డులకెక్కిన ఈ బ్రిడ్జి 1820లో వచ్చిన మూసి వరదలకు స్వల్పంగా దెబ్బతింది. 
 
దీంతో అప్పటి నవాబు సికిందర్ షా మరమ్మతులు చేయించాడు. 1908లో మరోమారు దీనికి మరమ్మతులు చేశారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ వెళ్లేందుకు వీలుగా 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా దీనిని నిర్మించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments