జీహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాదాపూర్, గచ్చిబౌలి, పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. శివారు ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్న ఆసక్తి ఐటీ ఉద్యోగులకు ఉండడం లేదు. పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది.
అలాగే పాతబస్తీలో పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పాతబస్తీ అంతటా 25 శాతం పోలింగ్ మించలేదని అధికారులు అంటున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదు అయింది. పలు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 29.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది.