Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగను పట్టుకోవాల్సిన ఎస్సై తానే దొంగగా మారాడు.. ఎందుకంటే...

దొంగను పట్టుకోవాల్సిన ఎస్సై తానే దొంగగా మారిన ఘటన హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని అల్మాస్‌గూడ శ్రీశ్రీహోంలో శివప్రసాద్ అ

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (10:44 IST)
దొంగను పట్టుకోవాల్సిన ఎస్సై తానే దొంగగా మారిన ఘటన హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని అల్మాస్‌గూడ శ్రీశ్రీహోంలో శివప్రసాద్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఇటీవల ఆయన కుటుంబ సమేతంగా కరీంనగర్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఎస్సై మహేందర్‌రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డాడు. 
 
సరిగ్గా అదేసమయంలో శివప్రసాద్ తన ఇంటికి వచ్చాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి నివ్వెరపోయాడు. వెంటనే శివ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగో పరుగున వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా సామాగ్రి అంతా చిందరవందరగా పడి ఉంది. అప్పుడే ఇంట్లో నుండి మహేందర్‌ రెడ్డి బయటకు వచ్చాడు. 
 
శివప్రసాద్, స్థానికులు అతన్ని పట్టుకుని వివరాలు విచారించగా తాను దొంగనని, ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చానని చెప్పాడు. దీంతో మీర్‌పేట్ పోలీసులకు సమాచారమిచ్చి వారికి అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకున్న మీర్‌పేట పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. చోరీయత్నం కేసు నమోదు చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments