Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాకు మరో రెండు వందే భారత్ రైళ్ళు.. ఎక్కడివరకంటే...

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (13:50 IST)
దేశంలో మరిన్ని వందే భారత్ పేరుతో నడిచే సెమీ హై స్పీడ్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక ప్రాంతాలకు వందే భారత్ రైళ్లను నడుపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్టం, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇపుడు మరో రెండు వందే భారత్ రైళ్లను నడుపనుంది. వీటిని హైదరాబాద్ - బెంగుళూరు, హైదరాబాద్ - పూణె స్టేషన్ల మధ్య నడిపే అవకాశం ఉంది. ఈ నెల 6న లేదా 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 
 
ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ కాచిగూడ - బెంగుళూరు యశ్వంత్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ కొత్త వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ - బెంగుళూరు ప్రాంతాల మధ్య రైలు ప్రయాణం సుమారుగా 11 గంటల సమయం పడుతుంది. కానీ, వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం ఈ ప్రయాణ సమయం 8.30 గంటలకు తగ్గనుంది. అంటే.. రెండున్నర గంటల సమయం కలిసిరానుంది. 
 
ఈ కొత్త రైలు కాచిగూడ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 3 గంటలకు బయలుదేరి, రాత్రి 11.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే, హైదరాబాద్ - పూణెల మధ్య కూడా మరో వందే భారత్ రైలును నడుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments