ఆర్టీఏ ఉద్యోగినిపై హోం గార్డు అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 జులై 2022 (07:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. హైదరాబాద్ రవాణా శాఖలోని కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగినిపై హోంగార్డు ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఓ వివాహిత సీనియర్ ఉద్యోగినిగా పని చేస్తున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమెకు 2018లో ఖమ్మం ఆర్టీవో కార్యాలయానికి బదిలీ చేశారు. 
 
అక్కడ తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో అక్కడ పని చేసే హోంగార్డు స్వామి ఆమెకు పరిచయమయ్యాడు. అద్దె ఇల్లు చూపించడంతో ఆమె పిల్లలకు స్థానిక పాఠశాలలో అడ్మిషన్ కూడా ఇప్పించాడు. అలా ఆమె కుటుంబానికి ఆపద్భాంధవుడిగా మారాడు. 
 
ఈ క్రమంలో ఓ రోజు ఆమె ఇంటిలో ఒంటరిగా ఉన్నపుడు జ్యూస్ తీసుకెళ్లి ఇచ్చాడు. అందులో మత్తు మందుకలిపి ఇచ్చాడు. అది సేవించిన ఆ వివాహిత అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఇదే అదనుగా భావించి అత్యాచారం చేశాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియో తీశాడు. 
 
మరుసటి రోజు నుంచి వాటిని చూపిస్తూ బెదిరించసాగాడు. పైగా, ఆమె నుంచి డబ్బు కూడా వసూలు చేయసాగాడు. అతని వేధింపులు మరింతగా ఎక్కువై పోయాయి. ఈ క్రమంలోనే ఆమె హైదరాబాద్ బదిలీ అయింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న హోంగార్డు స్వామి. 
 
మళ్లీ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. రాత్రివేళ వీడియో కాల్ చేసి నగ్నంగా మారి మాట్లాడాలంటూ వేధించసాగాడు. ఒక దశలో 50 లక్షల రూపాయలు కావాలంటూ ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె తన తల్లితో పాటు స్వామి భార్య దృష్టికి కూడా వేధింపుల విషయం చెప్పింది 
 
దీంతో మరింతగా కక్ష పెంచుకున్న స్వామి.. బాధితురాలు వదిలేసిన భర్త, అత్తమామలకు వీడియోలను పంపించి డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ ఫిర్యాదు చేశాడు. చివరకు అతడి వేధింపులు భరించలేని ఆ వివాహిత ఈ నెల 22వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్వామిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

SSMB29 చిత్రంలో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్, గన్ ఫైర్

అప్పట్లో తెలియక బెట్టింగ్ యాప్‌ని గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేసా: ప్రకాష్ రాజ్ (video)

కాంత లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి : దుల్కర్ సల్మాన్, రానా

సంతాన ప్రాప్తిరస్తు తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది - తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments