Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతు బొమ్మలు చూస్తున్నాడనీ... కన్నబిడ్డ చేయి నరికేసిన తండ్రి

ఫోనులో బూతు బొమ్మలు, అశ్లీల వీడియోలు చూస్తున్నాడని కన్నబిడ్డ చేయి నరికేశాడో తండ్రి. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని పహాడీఫరీఫ్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (10:38 IST)
ఫోనులో బూతు బొమ్మలు, అశ్లీల వీడియోలు చూస్తున్నాడని కన్నబిడ్డ చేయి నరికేశాడో తండ్రి. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని పహాడీఫరీఫ్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పహాడీఫరీష్ జల్ పల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖయ్యుం అనే వ్యక్తి ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయన పెద్ద కుమారుడు ఖాలెద్ ఖురేషీ (18) లోకల్ కేబుల్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. కొంత కాలంగా ఖురేషీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. పనికి కూడా సరిగా వెళ్లకుండా, పొద్దస్తమానం ఇంట్లోనే కూర్చొని, ఫోను చూడటమే పనిగా పెట్టుకున్నాడు. ఇది గమనించిన తండ్రి.. ఏం జరుగుతుందో దృష్టి పెట్టాడు. అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడని గుర్తించి మందలించాడు. అయినా ప్రవర్తనలో మార్పురాలేదు. 
 
దీంతో కుమారుడి మొబైల్ దాచగా, తండ్రికుమారుల మధ్య గొడవ జరిగింది. ఓ సారి తండ్రిపైనే దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సర్ధిచెప్పి మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. అయినా వినకుండా మార్చి 5వ తేదీ సోమవారం ఇంట్లో ఖురేషీ అదే పనిగా మళ్లీ మొబైల్ చూస్తూ తండ్రి కంట పడ్డాడు.
 
కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తండ్రి ఖయ్యూం.. మాంసం కొట్టే కత్తితో కుమారుడి చేయి నరికాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఖురేషీని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కుమారుడి చేయి నరికింది నేనే అంటూ తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments