Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:09 IST)
హైదరాబాద్ నగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ పట్టభద్రుడు... విగత జీవుడై కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ ప్రాంతానికి చెందిన గోగుల రవీంద్ అనే పీహెచ్‌డీ పట్టభద్రుడు బోడుప్పల్‌లోని ద్వారకా నగరులో నివాసం ఉంటున్నాడు. పైగా, రవీందర్‌కు వివాహమైంది. ఉద్యోగం లేక ఇంటిపట్టునే ఉండటంతో భార్య రజిత కూడా చీటిపోటి మాటలు అనసాగింది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. 
 
దీనిపై రవీందర్ భార్య స్పందిస్తూ, సోమవారం సాయంత్రం తాను వంటగదిలో పనిచేసుకుంటుండగా, రవీందర్ బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకున్నాడని భార్య రజిత వెల్లడించింది. ఎంతకీ తెరవకపోవడంతో కిటికీ తెరిచి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని వ్యాఖ్యానించాడు. 
 
ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, రవీందర్‌ను ఆసుపత్రికి తరలించామని రజిత పేర్కొంది. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారని తన ఫిర్యాదులో వివరించింది. అయితే, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments