Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడి క్షణిక సుఖం... ప్రియురాలికి గర్భం... అబార్షన్‌తో బలి...

ఆ ప్రేమ జంట హద్దులు మీరింది. ప్రియుడి తన క్షణిక సుఖం కోసం ప్రియురాలిపై తెచ్చిన ఒత్తిడి ఆమెను గర్భవతిని చేసింది. దాన్ని ఎలాగైనా తొలగించాలనుకుని గర్భస్రావం చేయిస్తే ప్రియురాలి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే

Hyderabad crime
Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (08:33 IST)
ఆ ప్రేమ జంట హద్దులు మీరింది. ప్రియుడి తన క్షణిక సుఖం కోసం ప్రియురాలిపై తెచ్చిన ఒత్తిడి ఆమెను గర్భవతిని చేసింది. దాన్ని ఎలాగైనా తొలగించాలనుకుని గర్భస్రావం చేయిస్తే ప్రియురాలి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, చీరంగూడకు చెందిన 19 ఏళ్ల యువతి ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలలో ట్రిపుల్‌ఇ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆమెతో రెండేళ్ల క్రితం మధు అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 
 
కాగా యువతి ఓ ప్రైవేటు హాస్టలులో వుంటూ చదువుతుండగా మధు ఫోటోగ్రాఫరుగా పని చేస్తున్నాడు. ప్రేమికులు ఇద్దరూ హద్దుమీరి శారీరకంగా కలవడంతో ఆమె గర్భవతి అయ్యింది. ఐతే తను గర్భవతి అయినప్పటికీ విషయాన్ని దాచేసి ఇంట్లో చెప్పకుండా ఐదు నెలలు లాక్కొచ్చారు ఇద్దరూ. ఆ తర్వాత ఏమనుకున్నారో గానీ అబార్షన్ చేయించాలని హయత్‌నగర్ డివిజన్ కమలానగర్‌లోని అనూష ఆసుపత్రికి వెళ్లారు. 
 
ఆమెకు అబార్షన్ చేసేందుకు డాక్టర్ గిరిజారాణి రూ.25 వేలు తీసుకుని గర్భస్రావం చేసింది. ఐతే యువతి 5 నెలల గర్భవతి కావడంతో గర్భస్రావం ఎదురుతిరిగి యువతి ప్రాణాల మీదికి వచ్చింది. ఆమె తీవ్ర అస్వస్థతకు లోనై అపస్మారకంలోకి వెళ్లిపోయింది. దీనితో ఆమెను వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలని సూచించగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీనితో యువతి తల్లిదండ్రులకు విషయం తెలియజేయగా వైద్యురాలిపైన, ప్రియుడు మధు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం