Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్లోకి లాగి... నోట్లో తువ్వాలు కుక్కి.. దీపావళి పండుగ రోజున దారుణం

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. అదీ కూడా దీపావళి పండుగ రోజు రాత్రే. పొట్టకూటికోసం పనికి వెళ్ళి ఇంటికి రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ యువతిని కార్లోకి లాగి.. నోట్లో తువ్వాలు కుక్కి.. అత్యాచారానికి పా

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (08:43 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. అదీ కూడా దీపావళి పండుగ రోజు రాత్రే. పొట్టకూటికోసం పనికి వెళ్ళి ఇంటికి రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ యువతిని కార్లోకి లాగి.. నోట్లో తువ్వాలు కుక్కి.. అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ శివారులో ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... పెద్ద అంబర్‌పేట శాంతినగర్‌కు చెందిన యువతి ఎల్‌బీనగర్‌ చింతల్‌కుంటలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి 9.30 గంటలకు బాధితురాలు విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. పెద్ద అంబర్‌పేట్‌ వద్ద బస్సు దిగి, శాంతినగర్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. 
 
ఆ సమయంలో ముగ్గురు యువకులు ఏపీ 29 టీవీ 6595 కారులో వచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అరవకుండాచేతి టవల్‌ను నోట్లో కుక్కారు. బలిజగూడ వైపు వెళ్తూ కారులోనే ఆమెపై ఒక యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలిని కారులోకి లాగుతుండగా శాంతినగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆమెను తమ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించాడు. స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో దుండగులు కారు అక్కడే వదిలి పరారయ్యారు. 
 
బాధితురాలు స్థానికులకు అసలు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిలో ఒక్కడే అత్యాచారం చేశాడని పోలీసులు నిర్దారించారు. వారిని మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments