Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు.. గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు.. తర్వాత హ్యాండిచ్చాడు!

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (11:50 IST)
హైదరాబాద్‌ నగరంలో మరో యువతి మోసపోయింది. పనీపాటా లేకుండా తిరిగే ఓ జులాయి మాయమాటలు నమ్మిన ఓ యువతిని లోబరుచుకుని గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు. ఈ ఘటన హైదరాబాద్ రెయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే యాకుత్‌పురా చావునీ నాదే అలీ బేగ్ ప్రాంతానికి చెందిన షేక్ షకీల్ కుమారుడు షేక్ నబీ అస్లాం అలియాస్ అస్లాం (20) అనే యువకుడు ఇంటర్‌ చదువు మానేసి.. పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఇతనికి బాగ్‌హే జహేరా ప్రాంతానికి చెందిన ఓ 17 యేళ్ళ బాలిక పరిచయమైంది. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. గత యేడాది కాలంగా తన లైంగికవాంఛ తీర్చుకున్నాడు. తీరా ఆ బాలిక గర్భందాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు.
 
ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో గతనెల 9న అస్లాం కుటుంబసభ్యులను కలిశారు. బాలికకు 18 ఏళ్లు నిండాక అస్లాంతో పెళ్లి చేద్దామని ఇరువురి కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే, పెద్దల ముందు పెళ్లికి అంగీకరించిన అస్లాం ఆ తర్వాత నిరాకరించాడు. అంతేకాకుండా బాలికకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేసి, ఆమెను అప్రతిష్టపాల్జేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు గురువారం రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 415, 417,420, 376 సెక్షన్ల కింద అస్లాంపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments