Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంహౌజ్‌లో రింగరింగా.. వీడియోలు వైరల్‌.. 12 మందిపై కేసు

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (13:20 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఉందాహిల్స్‌లో ఓ ఎంఐఎం నేత నిర్వహించిన రేవ్ పార్టీ ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మజ్లిస్‌ పార్టీకి చెందిన నేతలు యువతులు, హిజ్రాలతో చిందులు వేయడం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ అయ్యింది. ఈ ఉదంతంలో 12 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వివరాలను పరిశీలిస్తే, పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మద్‌ పర్వేజ్‌ అనే వ్యక్తి మజ్లిస్‌ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉండే నేత. బండ్లగూడ గౌస్‌నగర్‌ ఉందాహిల్స్‌ చెరువు సమీపంలో నూతనంగా ఓ ఫాంహౌస్‌ను నిర్మించాడు. ఫిబ్రవరి 13న ఆ ఫాంహౌస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రేవ్‌పార్టీని ఏర్పాటు చేశాడు. 

దీనికి మజ్లిస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు, పర్వేజ్‌ స్నేహితులు హాజరయ్యారు. రేవ్‌ పార్టీలో నలుగురు యువతులు, నలుగురు హిజ్రాలూ పాల్గొన్నారు. పర్వేజ్‌ సహా మిగతా వారందరూ మద్యంతాగి వారితో చిందులు వేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. 

వారితో యువతులు అశ్లీల నృత్యాలు చేసినట్లుగానూ ఉంది. ఈ మేరకు ఫలక్‌నుమా ఏసీపీ ఎం.ఎ.మజీద్‌ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్‌, డీఐ ప్రసాద్‌వర్మ ఫాంహౌస్‌ను పరిశీలించారు. పర్వేజ్‌తో సహా 12 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రేవ్‌పార్టీ వీడియోలను మంగళవారం ప్రత్యర్థి పార్టీల నేతలు వైరల్‌ చేయడంతో ఈ ఉదంతంపై మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ఒవైసీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. పర్వేజ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments