ఎంబీబీఎస్ విద్యార్థినిని మాయ చేసిన తొమ్మిదో తరగతి విద్యార్థి.. ఎలా?

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (08:28 IST)
వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థినిని తొమ్మిదో తరగతి చదివే బాలుడు ఒకడు మాయ చేశాడు. పొరుగింట్లో ఉన్నాడు కదా.. దగ్గరకు చేరదీస్తే... ఆ విద్యార్థిని పరువు తీశాడు. ఇపుడు జువైనల్ హోంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అసలు ఎంబీబీఎస్ చదివే విద్యార్థిని 9వ తరగతి చదివే బాలుడు ఎలా మోసం చేశాడు తెలుసుకుందాం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నగరంలోని ఓ కాలనీలో ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. తమ్ముడి వయసున్నవాడు. పైగా పక్కింటి పిల్లోడే కదా అనుకుని అమాయకంగా తన ఫోన్‌ను అతడికి ఇచ్చేదామె. 
 
ఒకానొక ఫైన్‌ మార్నింగ్‌.. ఫోన్‌లో ఆమె మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ను మార్చేశాడు. అక్కణ్నుంచీ ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు. 
 
ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకునేది. ఆమె అలా బాధపడినప్పుడల్లా అతడు కూడా.. తన అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు. ఈ మానసిక వేదనను చాలా రోజులపాటు భరించిన ఆ యువతి ఇక తట్టుకోలేక సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్‌ ఓపెన్‌ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు. 
 
దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. కాగా.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడని తెలియడంతో ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments