Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీలకు మత్తు వదలగొడుతున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:29 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింకీ జరిగిన రేవ్ పార్టీలో అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా పోలీసులకు చిక్కిన వారందరినీ ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. 
 
ఇటీవల జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ పబ్‌పై సోదాలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే, రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లైసెన్సును కూడా రద్దు చేసింది. అదేసమయంలో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి. మత్తు పదార్థాలకు బానిసలైన ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా 13 మంది ఐటీ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. 
 
పైగా, పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల జాబితా ఉంది. దీంతో వీరి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులకు పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ ఫెడ్లర్ టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతిల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments