Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ చేసి పెట్టలేదని భార్యను తరిమేశాడు... ఇంటి ముందు దీక్ష

సాధారణంగా కొత్తగా వివాహమైనవారు ఏదో చిన్నచిన్న కారణాలతో గొడవలు పడుతుంటారు. చివరకు పెద్దలు కలుగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసి మళ్ళీ వారి కాపురాన్ని కలుపుతారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటనతో పెద్దలే కాదు పోలీసులు ఆశ్చర్యపోయారు. తన భార్య బిర్యానీ వం

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (20:32 IST)
సాధారణంగా కొత్తగా వివాహమైనవారు ఏదో చిన్నచిన్న కారణాలతో గొడవలు పడుతుంటారు. చివరకు పెద్దలు కలుగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసి మళ్ళీ వారి కాపురాన్ని కలుపుతారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటనతో పెద్దలే కాదు పోలీసులు ఆశ్చర్యపోయారు. తన భార్య బిర్యానీ వండి పెట్టలేదని ఏకంగా తన భార్యను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు భర్త. తెలంగాణా రాష్ట్రం మహబూబ్ నగర్‌లో జరిగింది ఈ సంఘటన.
 
యాదయ్యగౌడ్, అంజలికి నాలుగు నెలల క్రితం పెద్దలు వివాహం చేశారు. మూడు నెలల పాటు వీరి కాపురం బాగానే సాగింది. అయితే ఒక నెలరోజుల నుంచి మాత్రం వీరి కాపురంలో చిచ్చు పెట్టింది బిర్యానీ. భర్త రోజూ రాత్రి ఇంటికి వచ్చిందే భార్యను బిర్యానీ పెట్టమని అడిగేవాడు. రోజూ బిర్యానీ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. వారానికి ఒకసారి మాత్రమే చేస్తానని చెప్పింది భార్య అంజలి. 
 
దీంతో కోపంతో ఊగిపోయిన యాదయ్యగౌడ్ ఆమెను ఇంట్లో నుంచి పంపేశాడు. పెద్దలు పంచాయతీ పెట్టినా, పోలీసులు హెచ్చరించినా సరే తనకు బిర్యానీ చేసి పెడితేనే భార్యను ఇంట్లోకి అనుమతిస్తానంటూ మొండిపట్టు పట్టాడు. దీంతో అతడి భార్య, భర్త ఇంటి ముందే ఆందోళనకు దిగింది. ఈ విషయం కాస్తా అలాఅలా స్థానికులకు తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments