Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు శాఖలో కరోనావైరస్ పరిస్థితిపై అధికారులతో చర్చించిన హోంమంత్రి

Webdunia
సోమవారం, 13 జులై 2020 (21:08 IST)
పోలీసు శాఖలో కరోనా వైరస్ పరిస్థితిపై పోలీస్ అధికారులతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు చర్చించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో మరియు పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖలో ఈ వైరస్ బారిన పడిన సిబ్బంది గురించి ఆరా తీశారు.
 
వైరస్ బారిన పడిన సిబ్బందికి మనోధైర్యం కలిగేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. కరోనా రోగుల పట్ల, వారిని ఆసుపత్రికి తరలించే విషయంలో పోలీస్ సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపై హోంమంత్రి అధికారులతో చర్చించారు. వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని హోంమంత్రి అభినందించారు.
 
"కోవిడ్ వారియర్స్"గా పోలీస్ సిబ్బంది చక్కటి పనితీరును కనబరిచి ప్రజల మెప్పు పొందారని హోంమంత్రి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసు సిబ్బంది వైరస్ బారిన పడ్డప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుని తిరిగి కోలుకున్నారన్నారు. వ్యాధి బారిన పడినప్పటికీ ఆందోళన చెందవద్దని, చికిత్స, జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదం ఉండదన్నారు. తను సైతం వైరస్ బారిన పడి కోలుకొన్న విషయాన్ని హోంమంత్రి ప్రస్తావించారు.
 
కరోనా వ్యాధి పట్ల ఆందోళన చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు పోలీస్ సిబ్బంది సేవ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందగలుగుతామని అభిప్రాయపడ్డారు. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును హోంమంత్రి అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments